Monday, October 4, 2021

తల్లడిల్లిన మనసు తేది : 10-08-2021 శీర్షిక : తండ్లాడుతుంది

 తల్లడిల్లిన మనసు

తేది : 10-08-2021
శీర్షిక : తండ్లాడుతుంది
కవిత సంఖ్య : 724

అంతులేని ఆలోచనల తరంగం 
అపారమైన విజ్ఞానాల ఖని  
అనంతమైన వివేకాల తటాకం  
అవసరమైన వివేచనల భాండాగారం 
ఇవేకదా..  ప్రత్యేకాలు  
జీవరాశిలోన  మనిషికి .... 

స్వార్థాల పరదాలెరుగని 
అమ్మ నాన్నలయినా 
స్వార్ధాల జోలెలుసుకున్న 
నేటి తరం నాయకులైనా ... 

నావాడు అన్న ఆత్మీయతల చోట  
ఆశలు కాస్తా నిరాశలైతే .... 
మన వాళ్ళన్న అనుబంధాల
అంచనాలు వంచనలైతే ....  

తోబుట్టువులతో ఉండే అనురాగాల
ఎదురుచూపులు బిత్తరపోతే 
బంధు మిత్రులతో  కలిసే బంధాల
నిరీక్షణలు నిర్వీర్యమైతే  .... 

భంగపడిన బాధలలో  కొంత 
నిస్పృహల నీటిలో జలకాలాడే 
మనస్తత్వం మనిషి మనసుకు 
ఒకింత ఎక్కువే  ...... 

తత్తరపడుతుంది....  
తలకిందులవుతుంది....  
తల్లడిల్లి తండ్లాడుతుంది .... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment