Tuesday, August 3, 2021

దేహ భాష తేది: 28-04-2021

 అంశం :  దేహ భాష 

తేది: 28-04-2021
శీర్షిక: కనికట్టు  
కవిత సంఖ్య: 651

తెలుపు నలుపు ఎరుపంటు 
తేట తెల్లమయ్యే రంగులు కాదు 
నవరసాలను పండించే నాడీ..
కదలకుండ పలకకుండానే
కబాడీలు ఆడించే కనికట్టు... 

అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి
ఉన్నట్టుగానే అనిపించినా... 
సంపదలతాలూకు తలబిరుసు
పరోక్ష రక్షణల పహారాలు కోరి 
అనుయాయులను అందలమెక్కించు... 

అవసరం లేనిచోట కూడా 
అజమాయిషీలు చేస్తూ
అదేపనిగా హుంకరిస్తూ 
మృగరాజులా రాజకీయాలు
ఒలకపోస్తూ అధికార మోజులో
కొట్టుమిట్టాడుతుంటారు....

కొందరేమో మనకెందుకులే అని 
మధ్యతరగతి ఓటరులా చూస్తూ 
కాలానికనుకూలంగా అలా అలా 
మారిపోతూ పచ్చని తరువులా 
 బతికేస్తుంటారు... 

అప్పడప్పుడు మాత్రమే సుమా
ఆనందాల పందిరి అల్లుకున్న 
మల్లె తీగలా అన్ని విషయాల ఆరితేరి
ఆ  శశిని బోలిన చల్లదనాలను 
కుమ్మరిస్తూ పండగలా వస్తాడు ..

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment