సద్భావన గేయాలు
తేది: 29-05-2021
శీర్షిక : అణు పితామహుడు
కవిత సంఖ్య : 675
భారతాన కొదువలేదు
మహానీయుల ప్రతిభలకు
పూవు పుట్టి పరిమళించె
పుణ్యాత్ముల కడుపున
మెహరీన్ హోర్ముసులకు
హామీ జే భాభాగా
దేశమే గర్వించగ // భారతాన//
భౌతిక శాస్త్రములో
బహుబాగా పరిశ్రమించి
భారతాన్ని నిలిపె తాను
బంగరు గగన వీథిన // భారతాన //
అణు పితామహుడయ్యే
ఆద్యంతం మెచ్చుకొనగా
స్వతంత్ర భారతమున
సంబరాలు జరుపుకొనగ // భారతానా //
అడుగులేసి తోడునిలిచె
అంతరిక్ష పరిశోధనకు
శాస్త్రీయ సలహాదారుగ
మన విక్రమ్ సారాభాయికి // భారతానా //
అపూర్వమైన సేవలకు
అందించే మనదేశం
అత్యంత విశిష్టముగ
పద్మభూషణ పురస్కారం // భారతానా //
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment