Tuesday, August 3, 2021

ముగింపు వాక్యము తేది: 30-04-2021

 ముగింపు వాక్యము 

తేది: 30-04-2021
శీర్షిక: సంపూర్ణత్వము ... 
కవిత సంఖ్య: 653

చిట్టి పొట్టి కవితలకయినా 
చిన్ని చిన్ని కథలకయినా 
రకరకాల నాటికలకైనా 
రక్తి కట్టించే నాటకాలకైనా 
రసమయమయిన కావ్యానికయినా 
రాజరికముగ వెలిగే ప్రబంధానికైనా 
ప్రారంభమెంత ప్రాశస్త్యమో 
పరుగులంఘించడం కూడ అంతే.... 
పరుగుతోపాటు పసందైన 
ముగింపు సైతం ముగ్దమే..... 

పండంటి జీవితానికైనా 
పర్వమైన ఉత్సవానికైనా 
శోభాయమానంగా ప్రారంభం 
నయనానందకరంగా సాగింపు 
హుందాగా ముగింపు ఉంటేనే 
సంపూర్ణత్వం సముపార్జించుకుంటుంది... 

అంతా మనచేతుల్లోనే అంతా మన చేతల్లోనే 
పిల్ల మొక్కలను పెంచుతూ పిసుక్కోకుండా
సంస్కారవంతంగా మంచిగా వంచాలి 
నొప్పికి భయపడితే  జీవితం సొట్టు పోతది 
మన ముగింపు మనకే  తెల్వకుండా పోతది .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment