పగటి వేషగాళ్ళు
తేది: 11-05-2021
శీర్షిక : కొంతమంది పాలకులు
కవిత సంఖ్య : 661
అక్షరాస్యతలనధిగమించ అలరారిన
అపూర్వమైన కళ ఆ రోజుల్లో ...
*ఉన్నది ఉన్నట్టుగా..*
నాలుగు మంచి మాటలు చెప్పే
ఉదర పోషణలకై ఉదయించిన
ఊసుల మయమైన జానపదకళ....
జన సామాన్యుల ఆశలు ఆశయాలను
రక్తి కట్టించి రమ్యమై బలంగా పాలకుల దృష్టికై
ప్రదర్శించే ప్రబలమైన.. ప్రజా ఆయుధం
జానపద కళలై దండిగా వర్దిల్లె నాడు...
నాడు.. కాస్తా నేడవ్వడానికి ఎన్ని పాట్లో
పొద్దున లేచింది మొదలు అన్నీ పొద్దు
పొయ్యే ముచ్చట్లే ... ఉద్దెర పద్దులే...
అగ్గువ అని చెప్పే అమ్మకాలే ...
మోసపోయి చేసే కొనుగోళ్లే ....
బొట్టుబిళ్ల నుండి పట్టుచీరదాకా ...
నైల్ కట్టర్ నుండి నైస్ కార్ దాకా ...
అన్నీ మోసాలే ...
బండ్లు ఓడలై ఓడలు బండ్లయినట్టు
నాడు ప్రజలు పనులు చక్కబెట్టుకుంటే
నేడు పాలకులు *మాయ మాటలు* చెప్పి
ఓట్లు చక్కబెట్టుకుని సీట్లనెక్కి ఫీట్లు చేసి
కోట్లు కూడబెట్టుకుంటున్నారు.....
మార్పులెన్ని మడత పెట్టినా
పగటి వేషగాళ్ళంటే ఫక్తుగా గుర్తొచ్చేది
మాత్రం కొంతమంది పాలకులే
నేడు... ప్రజలకు నిత్య జీవితాన ...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment