Tuesday, August 3, 2021

కాలం విలువ తేది: 04-05-2021

 కాలం విలువ 

తేది: 04-05-2021
శీర్షిక: అత్యావశ్యకం ..... 
కవిత సంఖ్య : 119

కని పెంచినవారికి ప్రాణం విలువ 
కష్టపడి జీవించిన వారికి బతుకు విలువ 
పట్టుదలతో గట్టెక్కినవారికి విజయం విలువ 
పరుగెత్తయినా సాధించినవారికి  కాలం విలువ ... 
తప్పకుండా  తెలుస్తుంది....... 

పల్లె...మత్తులు వదిలి విదిలించడానికైనా
పాలు పితికి పట్నానికి పంపడానికైనా 
హలం పట్టిన  రైతు పోలమెళ్లాలన్నా 
కత్తి పట్టిన రాజు రాజ్యమేలాలన్నా .... 
కాలమెరిగి నడచుకోవాల్సిందే..... 

చదువుల పిల్లలు బడికెళ్లాలన్నా 
తల్లులు వారిని తయారు చెయ్యాలన్నా 
అందరూ ఆదుర్దాగా ఆ వైపే  చూస్తుంటే
అబ్బో కాలసూచీ చాతీ  ఓ అంగుళం పెరుగుతుంది .......

నిజ కాల విలువ తెలియాలంటే 
పయనంలో జనం హడావుడి 
పోటీ పరీక్షల పిల్లల హైరానా 
షిఫ్ట్ డ్యూటీల్లో కార్మికుల కంగారు 
శాంతి భద్రతల్లో పోలీసుల పరుగులు .... 

ప్రమాదాల పొత్తిళ్ళలో అంబులెన్సులు
ఆసుపత్రి  ఓటీలలో మత్తుమందు డాక్టర్లు 
సరిహద్దు కంచెల్లో సిపాయి కదలికలు 
ఉపగ్రహాలను సంధించే శాస్త్రవేత్తలు .... 
చూస్తే కాలం విలువ శాలువా కప్పుకుంటుంది

నగునూరి రాజన్న
కరినగరము. 


No comments:

Post a Comment