సరస గీతం
తేది: 22-05-2021
శీర్షిక : ఒక్కటిగా నిలుద్దాం
కవిత సంఖ్య: 669
మాట వినవె మనోహరి
మారాములు మానవే
పట్టుదలకు పోకే నువ్వు
పంతాలను పక్కనెట్టు
మాట మాట పెంచకూ
మల్లెలెదురుచూస్తున్నయి //మాట//
గ్రీష్మంలో తాపంలా
భీష్మిoచి కూర్చోకు
తొలకరిలో చినుకులా
స్వాతిముత్యమైపోవే //మాట//
ఇంటివెనక మల్లెతీగ
పందిరంత పాకింది
ఊసులకు వేళయిందని
ఉత్తరమే పంపింది //మాట//
వర్షఋతువు వరదలాపి
హేమంతపు శశివై నీవు
వసంతాల కొయిలగా
వయ్యారాలు కులకవే ..... //మాట//
అందమైన ఆకాశం
సందమామకింద మనం
తారలతో ముచ్చటించి
ఒక్కటిగా నిలుద్దాం. //మాట//
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment