Tuesday, August 3, 2021

చిత్ర కవిత తేది: -14-05-2021 ( Oldage husband carrying his sick wife)

 చిత్ర కవిత 

తేది: -14-05-2021 
శీర్షిక: పుణ్య దంపతులు 
కవిత సంఖ్య : 25 

ఆలుమగలు జీవనాన అల్లుకున్న
మల్లెతీగలు... పూవు పుట్టగానే 
పరిమళించినట్టు... కట్టుకోగానే 
వ్యాపించు సుమ సుగంధాలు ... 

అమ్మా నాన్నల ఆత్మీయతలను 
అనునయించి పంచగలిగే బంధం 
తోబుట్టువుల అనురాగాలను సైతం 
మురిపించగల బంధుత్వం .... 

సృష్టి కార్యములో సశాస్త్రీయ 
సమిధలవుతూనే....కష్ట సుఖాలను 
కలిసి పంచుకుని...ఇష్టంగా జీవితాన 
ముందుకెళ్లే ఆలుమగల  అనుబంధం ... 

భర్తలు గృహసీమకు రాజులైతే 
భార్యలు అచ్చమైన మంత్రులై
సలహాల సందళ్లతో ... స్వచ్ఛమైన 
సిపాయిలా అడుగులేసే అమరమైన 
బంధం... 

బాధ్యతల చిక్కుముళ్ళన్నీ
బలాదూరుగా గిరాటేసి చక్కగా...
ముదిమి వయసులో ముద్దు
తీర్చుకుంటున్న  పుణ్య దంపతులు ... 

ఒకరికొకరై ఒద్దికగా మురిపాలు వంపుకుని 
ప్రేమలు పంచుకుని  ఆది దంపతులే 
అచ్చెరువొందే రీతిన తీర్చి దిద్దుకుంటున్న
తీపి మధురాల తీయనైన దాంపత్యం ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment