Tuesday, August 3, 2021

అంతా మన మంచికే తేది: 05-05-2021

 :అంతా మన మంచికే 

తేది: 05-05-2021
శీర్షిక: స్థితప్రజ్ఞత
కవిత సంఖ్య : 20

కష్టాలలో కూడా ఇష్టాలను 
దుఃఖాలలో సైతం మంచిని 
కపటాలలోన కనుమరుగైన....
మోసాలలోన ...నిబిడీకృతమైన 
అనుభవాలను చూడగలిగేతనం .... 

పరిస్థితులేవైనా పరేశాను 
కాకుండా...హుందాగా స్వీకరిస్తూ 
దాగిన మంచిని  మాత్రమే దండిగ 
చూడగలిగిన స్థితప్రజ్ఞత .... 

ఆనవాయితీగా వచ్చే రాజు మంత్రి 
కథలా..వేలుపోయినా  అంతా 
మనమంచికే అన్న మంత్రిలా....
కన్నెర్ర జేసి కారాగారాన బంధించిన రాజులా... 

కారడవుల్లో కబోదిలా కోయలకు చిక్కిన 
రాజులా.. కొరకు కాడని వదిలిన కోయల్లా... 
సుఖాంతమయిన రాజు మంత్రిల 
సుందరమైన కథలా....సున్నితం
కాకపోవచ్చు అన్నీ అచ్చంగా .... 

చైనా వాడి చెడుగుడాటలో
కొంగులార్చుకున్న కోట్ల మంది... 
ఎవరి మంచికై ఎదురు నిలిచె... 
ఆత్మీయుల నొదులుకుని హరో హర ... 
అయినా తెలిపె కదా...అత్యున్నతం 
ప్రకృతి సమతుల్యమని సదా..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment