చంగల్వ
తేది : 11-05-2021
శీర్షిక: సువాసనల సుందరం
కవిత సంఖ్య: 121
ఇసుక తీరాలనే ఇల్లుగా
మలచుకుని తడి పొడినేలలు
తనవుకు హత్తుకుని చిత్తుగా
నిర్భయమ్ముగ నీరంది పొదలాగా
పెరిగేటి పొదరింటి మొక్క ...
మొక్కలేమో బహు మోస విషపూరితం
మొగ్గ పూవులేమో మంచి సువాసనాసుందరం
రాత్రివేళలందు రమ్యతలు పెంచుతూ
రమణుల మురిపమై సువాసనలు పంచి ....
చిన్ని కృష్ణుణ్ణి చేరి కోలచిన
చెలువ పువ్వు మన చెంగల్వరా
లేతాకు పచ్చలో లేహ్యమై మెరియంగ
ఓషధీ నదులలో ఓలలాడుతూ .....
పూవు చూచిన భలే పోగులోలె
పొడవుగా పెరిగి ఈకలోలే కన్పించు
పోలు విరియు విరివిగా
ఎండుగడ్డి విధముగా ధరలోన...
సాహితీ లోకాన సవ్వడిగ
మెరిసేటి సమున్నత
సాంకేతికతలోన సన్నుతంగా
అందిపుచ్చుకున్న సాటి
వాట్సాప్ సమూహాన నేటి
కవితకు విషయమై వర్దిల్లె ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment