Tuesday, August 3, 2021

అనుమానం తేది: 02-05-2021

 అనుమానం 

తేది: 02-05-2021
శీర్షిక: మహావృక్షము.... 
కవిత సంఖ్య : 117

ఆకలి తీర్చే అన్నమే 
అతిగా తింటే విషతుల్యమైన విధం
అతి సర్వత్ర వర్జియేత్ చందమే 
అతిగా ప్రేమించినా..ఇష్టాలు పెంచుకున్నా ... 

సమయము సందర్భమెఱుఁగని 
స్వార్ధపు రెక్కలు విచ్చుకున్నాయో ... 
సంశయాల బీజం చిలకరించుకుని 
అనుమానపు మొక్కలు ఎదిగితే 
ఆత్మీయులకు చుక్కలు చూపిస్తుంది .... 

అదే గనక మహావృక్షమైతే 
అంతరాలలో చేరి తుమ్మెదలా 
తొలిచి మానవీయతను కబళించి 
మంచితనాన్ని  గుల్లబారుస్తుంది ... 

చెరువులో గుర్రెపుడెక్కలా విస్తరించి 
ఆత్మీయతలను విషతుల్యం చేస్తూ
మల్లెలాంటి హృదయ కుసుసుమాన్ని
మురుగు నీటి చెత్తకుప్పగా మార్చేసి 
రాక్షత్వానికి రాచమార్గమేస్తుంది.... 

నిండిన చెత్త బుట్టను మెండుగ 
క్రిమికీటకాలు ఆకర్షించిన విధంగా
దండిగ చేరిన చెప్పుడు మాటలు 
అనుమానపు పురుగులై  తొలుచు.... 

చెప్పుడు మాటలకు చెవులొగ్గక 
తప్పుడు నిర్ణయాలు మనలో తలవక 
మంచితనంతో మనం మసులుకుని
మనసు పెట్టి చూస్తే భ్రమలు వీడవా .... 

చీల్చుకున్న చీకటి కొట్టంలో
వెలుగుల ఆలమంద విరిసి 
వేల కాంతుల దర్శనమీయవా.... 
ఆనందాల పరిమళం విస్తరించదా.... 


నగునూరి రాజన్న
కరినగరము. 



No comments:

Post a Comment