Tuesday, August 3, 2021

నమ్మ శక్యమే... తేది 10-05-2021

 నమ్మ శక్యమే... 

తేది 10-05-2021
శీర్షిక: నమ్మ శక్యం కాని.... 
కవిత సంఖ్య: 660 

బాల్యములో అంతా 
బంగారు మయమే 
ఆటకోయిల తనంతో 
అంత మనవాళ్లే నన్న భావన ... 

కాలగమనంలో కల్సి 
పయనిస్తుంటే కదా 
ఒకటొకటిగా ఒలికిపోతుంటే
అసలు ఆలోచనల అంతు 
తెలుస్తున్నది.... 

ఏ ఎండకు ఆ గొడుగులా
అక్కరపూర్తి గొడుగులకే 
అడుగడుగునా అడుగులకు 
మడుగులొత్తుతున్నారు ....  

స్వార్థాల సంచులు నెత్తికెత్తుకుని
బంధాలు బంధుత్వాలన్నీ గూడ 
ఎడారిలో ఎండమావులై పోయి 
నీలి నీడలు కమ్ముకుంటున్నాయి... 

కలిమాయలో...  కాలగమనములో... 
నాడు చూసిన ఆత్మీయతలు
నింపుకున్న అనుబంధాల తీగల
ఆనందాలకు..నేడు నడుస్తున్న 
గాలివాటం నా "అను" కుంటున్న 
"బంధాలకు"  నమ్మశక్యం కాని 
అంతరమే సుమా ...... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment