Tuesday, August 3, 2021

రెండవ కెరటం తేదీ :03-05-2021

 రెండవ కెరటం 

తేదీ :03-05-2021
శీర్షిక : స్వీయ రక్షణే  శ్రీరామ రక్ష 
కవిత సంఖ్య : 655

మానవత్వపు జాడలు వీడిన 
నరహంతకుల నజరానాగా 
రాక్షత్వపు జడలు విరబోసుకున్న 
కృత్రిమ సూక్ష్మక్రిమి తుఫానులా 
విస్తరించే.... 

మొదటి అలతోనే విసిగి వేసారి 
మొస కూడా తీసుకోకముందే 
పులిమీద పుట్రలా మునగదీసుకుని 
ముంచెత్తే మరొక అలతో సునామీలా .... 

సందట్లో సడేమియాల్లాగా 
సంకన ప్రాణవాయువు కంపెనీలతో 
సంక్షోభం సృష్టించి పాలకుల మెడలు 
వంచ.... జనసామాన్యుల ప్రాణాలు తోడేశారు 
తోడేళ్లయి కొంతమంది పెత్తందార్లు..... 

కాసులపై మోజు తీరని...  కనికరం 
లేని పిశాచాలు కొంతమంది... విజ్ఞులు సైతం
ప్రాణాలను పిసికేసి...పాప పుణ్యాలను 
గంగలో వదిలి తుంగలో తొక్కారు ..... 

రెండవదే కాదు... మూడు 
నాలుగంటు కూడా జోడవుతాయని 
నెత్తి నోరు మొత్తుకునె... వైజ్ఞానికులు   
మానవ మంద బుద్ది ఇలాగే సాగితే...

ఏదేమైనా... బ్రతుకు బ్రతుకనియ్యు 
జీవరాశులన్నింటిలోనూ మానవాళే
మహోన్నతమని చాటండి... మరోసారి...
స్వీయ నియంత్రణలే శ్రీరామరక్ష యని .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment