గలుమ
తేది: 29-04-2021
శీర్షిక: విలువైన సంపద
కవిత సంఖ్య: 652
నాగరికతల నడకల్లో నరుడు
తన్ను తాను రక్షించుకోవ
తీర్చి దిద్దుకున్న తీరైన
తలుపులమ్మ కవచం ....
ఉదయాత్పూర్వమే ఇంటి
ఇల్లాలు శుభ్రంగా కడిగి నిండుగా
పసుపు రాసి పిండితో ముగ్గేసి
కుంకుమ బోట్లతో పూదిస్తుంది....
తాత ముత్తాతల నుండి వారధి
తనువున్నంత వరకు పవిత్రంగ
పూజిస్తూ మరో తరానికందించే
తరతరాల వారసత్వ సంపద ....
పండుగలలో పబ్బాలలొ
ప్రత్యేక ఉత్సవాలలో
ఇంటిల్లిపాది శ్రద్దగా
పూజించే పెద్ద ఇలవేల్పు ....
పచ్చని మావిడాకు తోరణాలతో
పరిమళాల పూల దండలతో
అలంకరించి శోభాయమానంగా
అతిథులను ఆహ్వానించే ఆనవాయితీ
మన హైందవాన ....మొత్తానికే
గలుమ మనకొక విలువైన సంపద ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment