Tuesday, August 3, 2021

స్థితి గతులు తేది:05-05-2021

 స్థితి గతులు 

తేది:05-05-2021
కవిత సంఖ్య : 119

అధికారానికి పేరు ఏది పెట్టినా  
అందలానికి ఎన్ని హంగులు చేర్చినా 
రాజ్యాంగాలు ఎన్ని రచించుకున్నా 
మార్పులు చేర్పులు ఎన్ని కూర్చినా ... 
రాజకీయపు క్రీనీడల రంగుల ఆనవాళ్లే .... 

వ్యక్తయినా... దేశ శక్తయినా .... 
మానవాళి  స్థితి గతులు ఎప్పుడూ 
నాయకుల కనుసన్నల్లో కదిలే  
పాలన దక్షతల దిక్సూచీలే .....

ప్రాప్త మోక్షమంటూ నుదుటి రాతంటూ 
మధ్య తరగతి ప్రజ సర్దుకున్నంత కాలం 
మాంత్రిక పాలకుల ఆగడాలు మామూలే 
బడుగు బలహీనుల ఉద్ధరణలంటూనే 
పన్నులేసి... సంక్షేమ పథకాలని సాగతీత.....  

పాలకుల పంట పండుతున్నది గాని 
ప్రజల బాధలు ఎన్నడు తీరడమే లేదు 
చీమకున్న పాటి చిన్న మెదడు లేదాయె
స్వయంకృషిని నమ్మిన సాధించవచ్చని...
సంసార సాగరాన్ని ఈది జయించవచ్చనే  లోకోక్తి .... 

మనమీద మనకు నమ్మకం..ప్రజలకు
సాటివారిమీద సద్భావము...పాలకులకు 
దేశమన్న సరైన ప్రేమ భావం..అందరికి
మేటిగా కుదిరిన మెచ్చవచ్చు ...స్థితి గతులు 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment