కొత్తరకం
తేది: 31-05-2021
శీర్షిక: నిజంగాఎంతో కొత్త .....
కవిత సంఖ్య: 132
స్వార్థ వైతరిణిలను నెత్తికెత్తుకున్న
తరం... నుండి సాంత్వన అడుగులేసి
భుజం తట్టి భరోసాలు నింపి...
అందరు బాగుండి.... అందులో
నేనుండాలనడం నిజంగాఎంతో కొత్త .....
రాజకీయాన్నే రక్షణ కవచంగా
అందరు ఆదాయవనరుగా
మాత్రమే మార్చుకుంటున్న తరుణాన
నేను తినను మరియు ఎవరిని
తిననీయననంటూ భీష్మించుకోవడం ....
ఎంతో కొత్త....
సర్వమత లౌకికవాదపు నీడలలో
మంచు టేరుల కొండ కాలువలలో
లక్షల మంది రుధిరపు సెలయేళ్ళు
పెచ్చరిల్లిగ..... స్వయం ప్రతిపత్తిని
సవాలుగ విసిరి.... సాంత్వనలు కూర్చడం ...
ఎంతో కొత్త....
అధికారాలతో తానెపుడు విర్రవీగక...
ఆగర్భ శ్రీమంతులను ఆదరముగ
కోరే ... సబ్సిడీలు వదులుకొమ్మని...
సవినయముగ వేడుకొని .....
అణగారిన లక్షల బీదలకు లక్షణమై
ఆదుకొనుట ఉజ్వల యోజనలే ...
నిజంగా ఎంతో కొత్త ....
నిశి జాడల అడుగులలో వేల లక్షల
కోట్ల బాండ్లనిచ్చి విశ్వ వీధి విఫణి వేలంలో
ప్రజలందరిని కుదువ పెడితే ....
కాదు కూడదంటూ ఖరాఖండిగా
తలసరి వేసి స్వతంత్రతలకు
పరుగులు తీయడం.....చాలా కొత్త .....
కత్తి డాలు ఇవ్వ కుండానే కదన
రంగములోకి దూకుమంటూ కర్కాశాల
మనస్తత్వపు తమాషా చూసే తరం....
మాది కాదంటూ మౌలిక సదుపాయాలన్ని
నాణ్యతలతో సమకూర్చడం ....ఎంతో కొత్త....
ఓటు నోటు దాగుడుమూతలలో
విసిగి వేసారిన జనులంతా ఏమి
పట్టించుకోకుండా నిత్య కృత్యాలతో..
ఆకలి దప్పుల అగ్ని హోత్రాలతో
బ్రతికే సామాన్య ప్రజలకు ప్రతీది ఎంతో కొత్త ...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment