తీరం లేని సాగరం
తేది: 13-05-2021
శీర్షిక : ఉక్కు సంకల్పం
కవిత సంఖ్య: 123
ఆశలతో సాగే పయనం
ఆశయాలను చేరుకోవాలనే
తపనలు ఓ పక్క ఉక్కిరి బిక్కిరి
చేస్తుంటే... సవాలక్ష సంశయాలు...
బాధ్యతల బందీలో చిక్కినాక
ప్రతి దినమూ పద్మవ్యూహమే
చిన్న చిన్న కష్టాలే కలవరపెడుతూ
చిమ్మ చీకట్లవలె తోచి.. తెలిసిన
ఉపాయాలను కూడా తెలివిలోకి
రానీయక ఉక్కరి బిక్కిరి చేస్తూ
ఊపిరాడనీయవు... శ్వాస
తీసుకోనీయవు...
నాటికన్ మైళ్ళ నడిసంద్రపు
సంసారమైనా ... దిక్కులు
చూపించగలిగే మొక్కవోని
ఉక్కు సంకల్పం ఒక్కటి చాలు...
ఆశల అలలపై ఆశయాల
నావ సహాకారముతో
సానుకూల దృక్పథాన
సమస్యలను సాధించుకుంటూ
తీరం వైపు సాగడమే విజ్ఞత ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment