పర్యావరణ గీతాలు
తేది:05-06-2021
శీర్షిక : నీ ఆయువు నీ చెంతే
కవిత సంఖ్య: 681
ఓ మనిషీ చూడవయా
ఒక్క క్షణం నిలకడగా
పదిలమైన నీ రూపం
పంచభూత మయమనీ
ఆకలి దప్పులన్నీ నీకు
అవని మాత తిప్పల్లేనని // ఓ//
పచ్చదనమే నీకొచ్చే
ప్రాణ వాయువులనీ
నదులు సెలయేళ్ళు
నీ ఉనికికి ఆనవాళ్లని // ఓ //
చెట్టూ చేమలే నీకు
గట్టి చుట్టములని గుర్తించు
పశుపక్ష్యాదులే నీకు
ప్రాణమిత్రములు నమ్మూ // ఓ //
ఎరుగను నేనంటూ
సాకులసలు చెప్పొద్దు
ఏమరు పాటు నీకు
అసలు తగదు సుమ్మీ // ఓ //
పట్టుబట్టి చెట్లు పెంచు
ప్రయత్నించి ప్రతిదినము
నిర్లక్ష్యం చేశావో
నీ శిక్షలు నీకె ఖరారు // ఓ //
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment