Tuesday, August 3, 2021

పోరాటం తేది 28-04-2021

 పోరాటం 

తేది 28-04-2021
శీర్షిక: మనిషి జీవనం .... 
కవిత సంఖ్య : 17

అరిష్టాలన్నీ దాటుకుని 
అమ్మకడుపులో నిలవడం 
ఉమ్మనీటిలో ఈదులాడుతూ 
తొమ్మిది నెలల పోరాటం .... 

బాలారిష్టాలను అధిగమించి 
బ్రహ్మాండమును  వెలగబెట్ట 
భువిపైన కాలుమోపి ఎదుగ
బుజ్జాయిగా ప్రతిదినము పోరాటం.... 

జీవితాన వెలుగులు నింప 
విజ్ఞానములు సముపార్జించు 
వివిధ దశల వినూతనమై 
వినమ్రంగా జరుపు పోరాటం .... 

జీవన భృతి సాధనలో 
నిత్యం రగులు అగ్నిహోత్రుడై 
నిరంతర మండే సూర్యుడై 
దివారాత్రముల పోరాటం ... 

సలహాలకే పరిమితమై 
సందర్భోచిత చలనశీలియై 
జీవన గతి చరమాంకంలో 
ముక్తిని మూటగట్టు భక్తి 
భావనలో పునీతమౌతూ 
అనాయాస ముగింపుకై 
జరుపు ఆఖరి పోరాటం ... 

నగునూరి రాజన్న
కరినగరము 


No comments:

Post a Comment