Tuesday, August 3, 2021

చిత్ర కవిత 18 Date :17-05-2021

 చిత్ర కవిత 18

తేది: 17-05-2021
శీర్షిక:  గమ్యం తెలియని గమనం 
కవిత సంఖ్య: 664 

గమ్యం తెలియని గమనంలా 
అప్పుడే రెక్కలొచ్చిన పక్షుల్లా 
అంతకంతకు ఎగబాకుతుండె 
ధరల సూచీలు దగా చేస్తూ 
అవసరాల బేరీజులు లేకుండా ... 

ఈ మూల నుండి ఆ మూల ఏ మూల 
కంతలో ఎక్కడ దాక్కున్నా వలసల్లో  
కారి  పారిపోయినా తప్పని తిప్పలే 
పొయ్యి మీది దినుసులకు నిత్యం 
పొయ్యి కింది చెఱకులకు సత్యంగా ... 

ధవళ వస్త్రాల ధారణలతో స్వార్థాల 
సంకేతాలే మేక వన్నె పులులకు
కడుపునిండా కలుషితాలతో 
కావలించుక ప్రేమలు కురిపించే 
కబంధ హస్తాల ధృతరాష్ట్ర కౌగిలే....... 

కుప్పలు కుప్పల అప్పులు జేసిన
స్వార్థాల సంచులు తప్పక నింపిన
తప్పుల తడకల లెక్కలు జూపిన
పప్పు కూళ్ళ పండుగలు జరిపిన
దేశాన్ని కొంతమంది కుదువ బెట్టిన  
ఆనవాళ్ళేమో .... 

పేద ధనికల తేడాలు చూపక 
ఇంటికొకరిని ఇగురంగా సరిహద్దుల 
కంచెకు కాపలా సిపాయిలను చేసే 
మహత్తర మంత్రాంగం రాజ్యాంగ గీతగా 
రచియిస్తే ... పాత్రలోని పాలన్నీ  నిక్కచ్చే 
ఇకనుండి ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment