Tuesday, August 3, 2021

నడవడిక శీర్షిక : ప్రవర్తన.... తేది : 03-05-2021

 నడవడిక 

శీర్షిక :  ప్రవర్తన.... 
తేది : 03-05-2021
కవిత సంఖ్య : 118

అసలు సిసలైన కేంద్రం 
పుట్టి పెరిగిన పుణ్యక్షేత్రం
అమ్మ నాన్నల ఆలనా పాలనలు
పరిసరాల ఘన ప్రభావం ...... 

అలవాట్లు పొరబాటుగాను 
పొరబాట్లు అలవాటుగాను 
ఏది జరిగినా.... అరిటాకు 
ముల్లు బంధం చందమే .... 

అంచనాలకు అందనిది 
ఊహల గాలానికి చిక్కనిది... 
దాగుడు మూతల సంక్లిష్టం
ధర్మ సంశయాల నిక్షిప్తం.... 

అంతరంగపు ఛాయా చిత్రం 
అనుభవాల ఆవిరి యంత్రం 
ప్రదర్శనలకు మూల విరాట్టు
మంచి చెడుల రేఖా చిత్రం ...

మాటలకు చేతలకు పొంతన 
కుదరకపోతే మకిలి చాయలు
మల్లగుల్లాలైపోతాయి.... 
అందుకే మన పనులు పరిమళాలు
వెదజల్లాలి ..... 

మంచితనాలకు కొలమానమై
మానవీయతల ఆత్మీయతలకు
చల్ల గాలికి గుంభనమై వర్షించే  
వరుణుని చిలకరింపులై సుగంధాలు 
వెదజల్లాలి.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment