అలంకరణ
తేది: 15-05-2021
శీర్షిక: బాహ్య సౌందర్యం
కవిత సంఖ్య : 127
పండగల పబ్బాల సందళ్ళలోన
పండంటి ఇండ్లను పదిలంగ
రంగు పూతలతో తీరొక్క ముగ్గులతో
తీర్చి దిద్ది... పచ్చనాకుల తోడ పందిళ్లు
సవరించి బంతి పూలతోడ బహు
రమ్యముగా సింగారింపడమే ....
కనిపించే కట్టు బొట్టులోనూ
నఖ శిఖ పర్యంతరముగాను
కట్టే బట్టలలోను పటుతరముగా
వైవిధ్యతలను జొప్పించి బాహ్య
సౌందర్యాలను బహు సుందరంగ
బంగారుమయమైన బాటలు
వేసి... వహువా అనిపించడమే ....
నిశిని బోలు కేశములకు
లేశమైన నూనెలు లేకుండా
మాయచేసి మర్మం దాచి
మంచి మంచి రూపాలను
తీర్చి దిద్దె సోయగముగా ...
ఆడ మగల తేడాలెరుగక
ఆధునికతల పోకడలలో
అందములను ఇనుమడించ
ఆభరణముల అలంకరించుచు
ఆనందములను పొందుచుండిరి...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment