Tuesday, August 3, 2021

చిత్ర కవిత తేది: 30-04-2021 ( A cat was browsing tab )

చిత్ర కవిత 

తేది: 30-04-2021
శీర్షిక: పలుక నేర్చిన చిలక.  
కవిత సంఖ్య: 18

పలుకులు నేర్చిన చిలుకలా 
పవళించి షోకులు పోతూ 
పట్టుకుందిగా స్మార్ట్ ఫోను 
పదిలంగా బొమ్మ వెదుకుతూ ... 

షరాబులైనా గరీబులైనా 
బేటా ఉన్నా లేకున్నా 
డాటాలను కలిగి ఉంటున్న 
దీటైన రొజీలివి కలియుగాన .... 

భాషల బాదరబందీ లేదు 
బొమ్మ కదిలితే దిమ్మ తిరిగే 
తెరలు తెరలుగా కదిలే 
కదలికలకు కళ్లప్పగించేసి 
కాలాన్ని కరగదీస్తున్నారు ....।

సాదు జంతువులైనా సరే 
సహజీవనమే స్మార్టుఫోనుతో 
ఇక దినచర్యే  గగనకుసుమమై 
నడవడానికి సవాలు విసురుతున్నది .... 

మత్తు మందులు మాత్రం 
మనుషులవరకే పరిమితమైనా 
మడత ఫోన్లేమో మిడతల్లా వాలి
అన్ని జీవరాసులకు అలుసైపోయే .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment