కనీసవయసు
తేది: 23-05-2021
కవిత సంఖ్య: 129
కన్న పిల్లల చదువులకైన కావాలి కద
కనీస వయసు కాలగమనమున నేడు
చదువుల తదుపరి ప్రతి మనుషి
కొలువుల కక్కెరే కొంత కనీస చదువులు...
ఆడ మగల తేడా లేక పేద ధనికల పేరు లేక
అధీకృతంగ సవ్యమై వాహనము నడప
కావలిసె కద కనీస వయసు ఖచ్చితమై
దివ్యంగ ఓటేసి దివిటీగ నాయకున్ని
దన్నుగా ఎన్నుకొనగ కావాలి కనీస వయసు
ఇల్లు చక్కదిద్దుకోను..ఇరువురికి పెళ్ళికీ...
అక్కరే కద ఇంపైన వయసు నియమం....కానీ
సంయమనమై సంఘమును పాలించి
సగబెట్టు పాలకులకెందుకీ సడలింపులు...
చదువు వయసుల పట్టింపులుగాని
లేనె లేవాయె పనిగట్టి నాయకులకు
పట్టి చట్టమున ప్రత్యేక నియమములు
పాలకులుగ నిలువ మన దేశమున....
కనీసం... జీవితాన కంచె కావాలిగ చేరి
సరిహద్దులోన శత్రువుకు ఎదురొడ్డి నిలిచిన
మంచోడుగా మారిన పౌరుడు...నాయకుడైతే..
ఎంత బాగుండు....ఎదుగు నా నాయకులు
బంగారమై బాగుపడు బహుగ నా దేశమీనాడు.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment