గతం గతః
తేది: 07-05-2021
శీర్షిక: పునాదులే ....
కవిత సంఖ్య: 658
భూమి గుండ్రమన్నంత సత్యం
అనాదిగా అవి పునాదులే
కష్టనష్టాలను కప్పి పుచ్చుకుని
చెడులను చెడుగుడాడుతూ ...
మంచినేరుకుని కంచెలు చేసుకొని
మానవజీవన మనుగడలో
సుఖసంతోషాలనింకా సుందరంగ
తీర్చి దిద్దుకోవడమే జీవిత నిత్యం ....
గతమైన తాత ముత్తాతలు
వర్తమానమైన మనందరికి
భవిష్యత్తు తరాలు అనేది ఒక
నిరంతర జీవన చక్రం ......
గంపకెత్తుకోవాల్సిన పనిలేదు
గడియ గడియకు చెప్పుకోకు
గతం వెలుతురులో వర్తమానపు
అడ్డంకులు తొలిగించుకుంటూ
భవిష్యత్తుకు బంగారు బాటలు
అందంగా వేసుకోవడమే కావాలి..
అనుభవాల మెట్లపై నడుస్తూనే
వర్తమాన వారధులను నిర్మిస్తూ
భవిష్యత్తు భవనాల నమూనాలకు
నాందిగా చేసుకోని మసలుకోవడమే......
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment