అల్లూరి సీతారామరాజు
తేది: 07-05-2021
శీర్షిక: మన్యం వీరుడు
కవిత సంఖ్య: 22
అల్లూరివారంటేనే
సల్లారిపోని ఉద్యమవీరుడు ...
తెల్లొరి గుండెల్లో పేలిన ఫిరంగి..
మల్లెల పరిమళాలు పంచె
మన్యం కూలీలకు....
బాల్యమంత గూడ కష్టాలపాలయినా
బహు కొద్ది వయసుకే బతికి బట్ట కట్టినా...
బడుగు బలహీనులకు సతతం
బాగోగులు కోరిన భాగ్యశాలి ....
అరాచకపు అన్యాయ మెదిరించ
అంగ బలమును సమకూర్చుకుని
అనువైన రీతి సాయుధ పోరాటమే
సన్మార్గమని నమ్మిన సాధుశీలి ....
బతుకుదెరవులకై తాను
ఊరూరు తిరిగినా.. భక్తి తోడ
ఉత్తర యాత్రలు చేసినా
చిత్తమెప్పుడు మన్యం ప్రజలే ...
మందబుద్దుల కొంత ఉద్దరించ
యుద్ధ విద్యలు నేర్చి తాను ఉచిత
వైద్యాలు నేర్చి ...ఉపశమింప జేసే
ఏజెన్సీవాసుల ఎదురు కష్టాలు ...
No comments:
Post a Comment