కళాశ్రీ చిత్ర కవిత
కవిత సంఖ్య (21).
తేది: 07-05-2021
రంతిదేవుని బోలు రమణి తాను
బిడ్డడి కడుపు నిండకున్నను గాని
కుండ నిండుకున్న నేమి...మిన్నకుండగ
కొంచమైనను..పక్షికి తాను పంచె చూడు ...
శిబి చక్రవర్తిని తాను మరిపించునేమో
విధి బలీయతలను సైతము వీరమున
కూడగట్టుకున్న కొండంత ధైర్యమున
పొల్లు బోని రీతిగ పక్షికేయుచుండె ...
దాన కర్ణుణ్ణి తాను తలదన్నునేమో
దండి సంపదల దాపున లేకున్నా
గుండె ధైర్యమే మెండుగా కలిగి
కాయ కష్టపు రొట్టె కాకికందించుచుండె.....
ఇంగితముంటే ఇగురమై నేర్వరే..
ఇలన స్వార్థముల సంచులున్న
సంకుచితాలోచనలు నిండిన
రాజకీయనాయకులు కొంచెమైనను ...
కోరి నేర్వరేలనో కొంతమంది అధికార
గణములు.... ప్రజల మేలు.....
సిగ్గు శరములు వీడి చిద్విలాసముగ
బల్ల కింద చేయి చాపి ...బతుకు టీవీలు
సింగారించుకుంటూ ... చేవ చచ్చిన పిపీలికాలు ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment