ధన దాహం
తేది: 18-05-2021
శీర్షిక: కన్ను మిన్ను కాననీయదు
కవిత సంఖ్య: 665
గౌ శ్రీ దాస్యం సేనాధిపతిగారి
రేఖా మాత్ర సమీక్షలో మెప్పు పొంది ...
దృశ్య కవితకు ఎన్నికై
యూ ట్యూబులో నిలిచిన కవిత
చరిత్రలెంత చర్విత చరణాలైనా
శునకపు తోకల భంగిమలేనాయే
కళ్ళముందు కథనాలెంత కదలాడిన
కనుపాపలు విధానాలను గుర్తించవు ...
మదమెక్కిన కోడెదూడలా
కన్ను మిన్ను కాననీయదు
స్వార్థాల తలబిరుసుల తంపులు
తమ పర బేధాలు చూడనీయదు ...
పచ్చ పచ్చని అడవులన్నీ
పిచ్చి పిచ్చిగా ఆవురావురుమన్నాక
కొండలన్నీ పిండిచేసి మింగేసి త్రేన్చి
ఇసుక క్వారీలను నంజుకున్నాక
సెలయేళ్ళ నీటిపాయాలేం ఖర్మ
డాములకు డాముల కట్టడాలు
కూడా తీర్చలేని దాహాలై పోతాయి....
మూర్ఖుల మనసు రంజింపలేమన్నట్టు
ఆత్మీయతలను ఆవలకు నెట్టి
మానవీయతలను మట్టి కరిపించి
కట్టు బొట్టు తానై కులుకుతుంది ....
అగ్నికి ఆజ్యం తోడులా
రాజకీయానికి అధికార దర్పం
తోడైతే రాజ్యములో బొగ్గులు
ఎండబోసుకొని నేర్పుకున్న
చందమేగా ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment