మా నాన్న గారు
తేది: 20-06-2021
శీర్షిక : నడతలు పాటించి నేర్పిన
నయన మనోహర మూర్తి.
కవిత సంఖ్య : 691
మా నాన్న గారు కీ శే దశరథ రాములు గారికి
ప్రేమతో….
ప్రశాంత వదనుడు పరిమళ చిరునవ్వులు
చిందించే ప్రసన్న మూర్తిమత్వం
మా నలుగురన్నదమ్ములకు చెల్లెలికి
పేరుకు తగిన పెన్నిధి దశరథరాములు ...
నానమ్మ తాతయ్య గురుతర బాధ్యతలు
తోబుట్టువులపై పెంచి పంచిన ప్రేమలను
మనసావాచా పాటించి చూపిన ఘనుడు
వరసలో కనిష్ఠుడైనా వావిలో ప్రథముడే ....
ప్రాణాలు ఫణముగా పెట్టి
మితృత్వమే గొప్పదన్న మేటి
అధికారముల కన్న ఆత్మీయతలు
మిన్నని చాటి ఆపత్కాలంలో ఆదుకునే పాటి ....
అవసరాలలో అందిపుచ్చుకుని
మొండిధైర్యాలతో పోరాడి నిలిచి
రంకు నేర్చిన రజాకార్లనెదిరించి
నమ్ముకున్నోల్లకు బలం కూర్చిన ధీశాలి ....
నాగరికతల నీడల్లో... నడకలు
నడతలన్నీ బోధించకుండానే
నాజూకుగా పాటించి చూపిన
నయన మనోహర ప్రతిభాశాలి...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment