చెంత చేరిన వింత
తేది : 10-06-2021
శీర్షిక: అంటు ముట్టు ....
కవిత సంఖ్య: 31
అంటు ముట్టులన్న అశ్రద్దలు జేసి
పెద్దలెందుకు జెప్పుట సుద్దులటంచు
సూటి పోటి మాటల.. సుక్కలు చూపించి
సూటి పోటి మాటల.. సుక్కలు చూపించి
కసురుకునిరి… మహిన కొంత మంది….
అన్న పానీయముల అలవాట్లె కద…
ఆటు పోట్ల విశ్వం అతలకుతలం చెందె
మంకు జేసి మాట వినని మర్కటత్వం
చేటు తెచ్చె చూడు…నేడు మానవాళికంతయు….
మత్తులు మాంసములు హద్దుమీరి… ఆపైన
కనపడినదల్ల కరిపించుకునిరి నోట
వద్దన్న పని..వారించినా వినకుండ
కోరి తెచ్చుకొనిరి…కొంత నాశనము ….
మలినాలు మనవని మానుకుందుమా
మనవే కదాని మాటి మాటికి తాకెదమా
హద్దు సుద్దులు తెలిసి మసులుకుంటూ
అవలీలగ పనులు చేసుకొనుటే విజ్ఞత కద….
అస్పృశ్యతలకు అవధులేమిటో
అర్థ వివరణలు తెలిపె కద కరోనా
ప్రాణ హాని భయం పుట్టించి…ప్రతి మనిషికిని క్షణ క్షణం చావు రేవును తలపిస్తూ....
షేక్ హాండులను తెగ ప్రేమించి
పాశ్చాత్యమంటే పడి చచ్చిరి
ఫలితమెరిగి వాతపడితె గాని
పారమార్థం గుర్తు రాలేదు....
నమస్కారమే తగిన పరిష్కారమై
శుచి శుభ్రతలే సర్వ భద్రమని
కుటుంబ సభ్యుల మధ్యనకూడా
అంటారాని తనమే ఒంటికి మంచిదని ....
చెంత చేరె తిరిగి తిరిగి వింతయై….
.
No comments:
Post a Comment