Tuesday, August 3, 2021

సంసారం ఒక .... తేది: 12-05-2021 శీర్షిక: సాగరం...

 సంసారం ఒక .... 

శీర్షిక: సాగరం... 
తేది: 12-05-2021
కవిత సంఖ్య: 24

కలి మాయల ప్రభావమో
కాలధర్మ నియమములో
పైనుండి ప్రశాంత భౌతికమైనా
బడబాగ్నులు భద్రపరిచిన 
అంతరంగం.... 
 
ధనకనక రత్నరాసుల్లాంటి 
పూర్వీకుల దీవెనలతో అలరారుతూ 
అందలాలెక్కినా... 
స్నేహ జలచరాల్లాంటి బంధు 
మిత్ర సంబంధీకులతో తారాడుతూ
తందనాలాడినా ....। 

క్రూర జలచరాల్లాంటి నిత్య 
శతృ మూకలతో పోరాడుతూ 
ప్రత్యక్ష పరోక్ష యుద్దాలు చేస్తూ... 

మురుగు కలుషితాల్లాంటి కాలుష్య
సంఘ వీరుల దళారీల 
లంచగొండి అధికార గణాలు  
స్వార్థపూరిత పాలకుల...
పరిచర్యలతో నిత్యం విసిగి వేసారినా ... 

ముక్కు మూసుకుని భరిస్తూ 
నిక్కచ్చిగా జీవనం సాగించడమే.... 
నిత్య జీవన పోరాటం...ఆరాటం... 
సంసారం ఒక సాగరం ...ఈదాల్సిందే... 

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment