ఉందిలే మంచి కాలం
శీర్షిక : సబబైన సంకల్పము ...
కవిత సంఖ్య : 20
గతాన్ని అనుభవంగా మలుచుకుని
వర్తమానం సరిదిద్దుకుంటేనే
భవిష్యత్తు అంతా ఆశాజనకం ....
శతాబ్దాల చరిత చూసినా...
బిత్తర పోయే అరాచకాలనే కాదు
గత్తర గాయిల పైశాచికాలను సైతము
రుచి చూసిన ఆనవాళ్లే మిత్రమా....
అనారోగ్యమైనా..అరాచకమైనా..
రొమ్ము విరిచి ఎదిరించి నిలిచి
రోజులెల్లదీసినోళ్ళమే కద సోదరా
ఆరోగ్యం కోసం..అంగబలం కోసం...
సూర్య చంద్రుల భ్రమణ గమనంలో
చీకటి వెలుగులు సమమైనట్టు
కాలమార్పుల కమామీషులలో
శిశిరానంతరం వసంతాగమనంలా ...
పరులను కాచుము ప్రకృతి వోలె
పబ్బతి బూని పరమాత్మ ముందు
సబబైన సంకల్పమును మనమున బూని
సరియైన దృడ చిత్తమున కృషి సలిపిన
సాగిల పడదె సర్వ విజయము తనకు తానుగ
ముందు ముందు మంచి కాలమై.....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment