Tuesday, August 3, 2021

మళ్లీ లాక్ డౌన్ తేది: 06-05-2021

 మళ్లీ లాక్ డౌన్ 

తేది: 06-05-2021
శీర్షిక: రాటుదేలిన రాజకీయం 
కవిత సంఖ్య: 657

కరోనా మాట వింటేనే కంగారు 
కలల ఉలికిపాటు గతేడాదినుండి 
హమ్మయ్య ! అనుకునే లోపే 
అమాంతం విరుచుకుపడే మళ్ళీ ... 

భద్రతల పట్ల... ప్రజల అలసత్వం 
మన్ను తిన్న పాము లొకవైపయితే
విచ్చలవిడిగా పెచ్చరిల్లి పోతున్న
రాటుదేలిన రాజకీయం మరోవైపాయె... 

పాలకుల మీద పగలతో ప్రజలను
పావులుగ చేస్తున్న స్వార్థ నాయకులు
చాప కింద నీరులా ఇంక వేరువేరు
వేరియెంట్లను కూడ దించుతుండిరి... 

గణాంకాలను పాతిపెట్టి కప్పి పుచ్చుతూ
చెప్పు చేతల్లోని నమ్మిన బంటు మీడియా
చెప్పినట్టు డప్పుకొట్టే ఉత్తమ పత్రికలన్నీ
కుంభ మేళాలను కుంటి సాకుగా చూపిస్తూ
ఎన్నికల ముచ్చట్లను ఎండగడుతూనే
ఎగదోసె ముచ్చట్ల పబ్బం గడుపుకో సాగె.... 

రంగులు పులుముకున్న రాజకీయం 
ప్రాణ వాయువుల కంపెనీలను 
గుప్పెట చిక్కించుకుని గంపగుత్త 
బలిహారణాలకు తెర తీయవట్టె ... 

పెడితే ఎందుకని అడుగుతా ? 
పెట్టపోతే ఎందుకు పెట్టలేదని 
నిలదీస్తా ? రెండుతలల పాములా  
వితండ మొండి వాదము చేయొచ్చిక.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment