Tuesday, August 3, 2021

శ్రీ శ్రీ ప్రత్యేక కవిత శీర్షిక: శతాబ్దపు ప్రవక్త తేది:30-04-2021

 శ్రీ శ్రీ  ప్రత్యేక కవిత 

శీర్షిక: శతాబ్దపు ప్రవక్త
తేది:30-04-2021
కవిత సంఖ్య : 19

సంప్రదాయ కుటుంబపు సద్దిముల్లె
పూవు పుట్టగానే పరిమళించినట్లుగా 
పదవ ఏటనే పదాలను ఉరికించిన 
ప్రజ్ఞాశాలి.... 
ఇరువైపుల కత్తి పదనులా విరుద్ద భావాల
పండించిన విజ్ఞానఖని...... 

కొంత మందికే  కొలమానమని 
కొట్టి పారేసారు సంప్రదాయ ఒరవడిని
ఛందోబద్ధతను ధిక్కరించిన ధీశాలి 
అందరికి ఉపయోగమని  ఆధునిక
అభ్యుదయానికి పెద్ద పీట వేశారు... 

అభ్యుదయ వాదాలను  బలపరుస్తూనే
వాడుక భాషను మాత్రతో వాడిగా జేసి 
బడుగు బలహీనుల బతుకుల బాగుకై
విప్లవ రచనలు కుమ్మరించిన విపంచి .... 

ప్రాసల శ్లేషల మాంత్రికుడై 
పాటలలో భావాలను నింపి 
దేశభక్తిని రంగరించి పొంగిస్తూ 
సినిమా పాటలుర్రతలూగించిన సిసింద్రీ .... 

మనిషిగా పుట్టినా ..
మహాకవిగా ఎదిగినా ...
మహర్షిగా మారినా ...
శతాబ్దపు ప్రవక్తగా గుర్తింపు పొందె .... శ్రీ శ్రీ ... 

నగునూరి రాజన్న
కరినగరము. 


No comments:

Post a Comment