ఇది నా సంతకం
తేది: 23-06-2021
శీర్షిక : సంతృప్తి ...
కవిత సంఖ్య : 694
అమ్మా నాన్నల అనుంగు శిక్షణలో
పల్లె తల్లి పంచి నేర్పిన పరిసరాలో
అంతర్నిర్మిత ఇంగిత జ్ఞానములొ
ఆటపట్టుగ నేర్చుకున్న మానవీయతలో ….
ప్రతిక్షణం పంచి ఇచ్చిన పరిమళాలే
పందిరళ్లుకున్నమరుల మల్లెతీగలా
అడుగడుగున అణకువలే ఆదరించి
నిలిచాయి విరగ కాసిన తరువులా ....
ఆలోచనలకు తోడుగా అమ్మలా నిలిచె
అమ్మ లాంటి మాతృ సంస్థ ప్రతి చోట
నిత్యం కోట్ల చెల్లింపుల్లో కూడా...చలించక
నిఖార్సుగా నిలువ గలిగాను నిట్టాడులా ......
నలుగురు నడిచే దారే ... అనుకుంటాం
మంచినెపుడు పంచుకొని పెంచుకో
చెడును విస్మరించి మనశాంతి పొందుకో
నలుగురి మాటెలా ఉన్నా నాకేంటని .....
పనులలో పవిత్రంగా... సేవలలో శభాషుగా
భాగం అయినందుకే... ఛాతీ పొంగించి
ఛాలెంజులు విసరగలిగే స్థాయి పొంది
సంతృప్తుల జీవితంతో సంతకం చేసు కున్నా....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment