ప్రాణదాత సుఖీభవ
తేది : 14-06-2021శీర్షిక : ఎందరో మహానుభావులు ....
కవిత సంఖ్య : 686
తరాలన్నీ కదిలి శిశువు తనువుకు
ఊపిరూదేది అమ్మానాన్నలైనా
బ్రతుకు గమనంలో మెతుకుగా
ప్రాణాలు నిలిపే వారెందరో.....
సూర్య చంద్రులూ సుందరమైన
తరులూ గిరులూ సెలయేళ్ళు
శరీర పోషణలో శక్తినిచ్చే ఇంధన
వనరులే ఇంగితమై శోధిస్తే.....
ప్రత్యక్షమైన వారు కొందరైతే
పరోక్షమైనవారు ఇంకెందరో ....
మూడుపూటలా ముద్ద పెట్టే
హలం పట్టి పొలం దున్నే రైతన్నకూడా ...
పుటం పెట్టి కాపాడుకునే ప్రాణాలకు
పురుగు కుట్టి కకావికలమైతే మందో
మాకో పెట్టి మరో జన్మనిచ్చి
పునీతమై కాపాడే పుణ్యమూర్తులు
కొంతమంది ధవళవస్త్రదారులు ....
శత్రుమూకల శరముల నుండి
శిథిలాలై చితికిపోకుండా మన
శరీరాలను కాపాడే సైనికుడు కూడా
నిష్ఠ కలిగినిన నిండైన ప్రాణదాతలే .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment