Tuesday, August 3, 2021

కార్మిక గీతాలు తేది: 01-05-2021

 కార్మిక గీతాలు 

తేది: 01-05-2021
శీర్షిక: కర్షకుడు కార్మికుడు
కవిత సంఖ్య: 654

భూమి చీల్చి బువ్వ పెట్టె కర్షకా 
భుజం కలిపి కర్రు కాల్చు కార్మికా 

తొలకరితో మొదలయ్యె
తోడునీడ మీ స్నేహం 
మట్టిలోని మణి రాసులు 
మా ఇంట వెలుసు గదా .. // భూమి // 

ఇడుగిర్వాలు ఇగురంగ
కర్షకుని కార్యమైతే
పొలం నాటి కలుపు తీసి
పోగు చేయు కార్మికుడు ... // భూమి // 

వండుక తినె  కుండయినా 
నిండుగా కప్పే బట్టయినా 
నీ రెక్కల కష్టమే మిత్రమా 
నిన్ను గుర్తించేదెవ్వరు నేస్తమా  // భూమి // 

అడుగడుగున పల్లెన 
మెతుకయ్యావు 
అందని పట్నంలో కూడా 
బతుకయ్యావు             // భూమి // 

నీవు లేని నిమిషాన 
నిర్వీర్యమే... విశ్వము
నీవున్న చోటనే 
బ్రతుకంతా స్వర్గము .... 
                                // భూమి // 
నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment