తెలుగు భాష ఔన్నత్యం
తేది: 22-03-2023
శీర్షిక : అజరామరం
వేల సంవత్సరాల వేలుపు
ముత్యమంటి అక్షరములతో
ముద్దులొలుకు పదసంపదలతో
ఆత్మీయతలను జోడించుకుని
అలరారుతున్నది నా తెలుగు ....
ఎప్పటికప్పుడు తత్సమ తద్భవ
దేశ్య అన్య దేశ్య గ్రామ్య పదాలను
కలుపుకుంటూ సాగుతున్నది
సార్వజనీనతల సందర్శిణియై .....
వ్యాకరణ నిర్వచనాల దిట్టగా ...
అలరించే ఛందోబద్ధతల పద్యాలతో ....
సుందరమైన అలంకారాలతో ...
శాస్త్రీయతల చలువ పందిరి ....
రాయలకాలములోనే రాచమర్యాదలు
అందుకుని అష్టదిగ్గజాలతో అపర
ఖ్యాతినార్జించి ....భౌగోళమును పోలిన
అక్షరాకృతులతో భువనవిజయమును
కూర్చినది ....
అది ఇది అను తేడా లేకుండా ...
అన్ని రకముల సాహిత్యాలను
అక్కున చేర్చుకుని .... అజరామరమై
ఆచంద్రతారార్కంగా వెలుగులీనుచు న్నది ....
No comments:
Post a Comment