Saturday, February 10, 2024

సావిత్రి భాయి పూలే తేది : 03-01-2023 శీర్షిక : పచ్చని తరువు ...

 సావిత్రి భాయి పూలే 

తేది : 03-01-2023
శీర్షిక : పచ్చని తరువు ... 
కవిత సంఖ్య :  సహస్రాధికం ... 

చిత్తు బొత్తులు  కలిసిన చిత్రమైన 
నాణెం ... జ్యోతిరావు సావిత్రిబాయి పూలే 
దంపతులు.... ఆయన ఆశయాలకు 
ఆమె మొగ్గ తొడిగి కాయలు కాసి 
ఫలాలను అందించిన పచ్చని తరువు. .... 

సగటు  జీవన బతుకు బండి గతుకులు 
లేకుండా ...నల్లేరుపై నావలా సాగాలంటే ... 
అక్షరజ్ఞానం అమోఘమైన అస్త్రం 
అని అక్షరాలా నమ్మిన ఆడపడుచు .... 

అట్టడుగు అణగారిన బహుజనుల
బతుకుల్లో  బాకుల్లా గుచ్చుకుంటున్న 
ఎన్నో సాంఘీక సమస్యలను ఛేదించుకుంటూ 
చక్రం తిప్పిన సవ్యసాచి ...... 

సత్యశోధక్ సంస్థ నారంభించి 
మూడాఛారాలకు గుడారం లేకుండా 
చేసి... ఎన్నో జీవితాల్లో వెలుగులు 
నింపిన మడమ తిప్పని మహా మేధావి .... 

నిరక్షరాస్త్యతల నిర్లిప్తతలను 
బాల్య వివాహాల బలిపీఠాలను 
అస్పృశ్యతల ఆకతాయితనాలను 
సతీసహగమనాల సంకుచితత్వాలనుఁ 
శిరోముండనాలను ఎండగడుతూ 
ఎదిరించి గెలిచిన వీరనారి ...... 

అనాధ బాలలను అక్కున చేర్చుకుని 
అమ్మగా అవతరించింది...పునర్వివాహా 
పుణ్యాలను మూటగట్టుకుని ... 
దుర్భిక్ష సమయాలను దునుమాడి 
తొలి తరం స్త్రీ ఉపాధ్యాయురాలై 
సమాజ తోటలో పరిమళాలను 
వెదజల్లారు ... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment