చిత్ర కవిత
తేది : 09-01-2023
శీర్షిక : మా ఇంటి మహాలక్ష్మి
కవిత సంఖ్య : సహస్రాధికం
అనుభవాల తోటలో
కలికితురాయి మన హైందవం ....
సంస్కృతి సంప్రదాయాల
సమున్నత వారసత్వాల నెలవే ...
పూర్వాసంధ్యన పడుచులకు
నిత్యకృత్యమే పల్లెపట్టున....
పసుపు లేపనాలను దిద్ది
అరుణవర్ణాలను అద్దంగా ...
సుందరమైన అందాలను
ఒలకబోస్తుంది వయ్యారంగా గడప....
ప్రతిదినము ముగ్గున్న లోగిళ్ళే
తీరైన సంపదలకు పుట్టినిల్లు ...
పల్లె పడుచు దరహాసంగా
పట్టుకుంది పంచపాల...
పట్టుబట్టి పూదిస్తుంది
పెద్దర్వాజ మనోహరంగా
మా ఇంటి మహాలక్ష్మిగా ....
విషకీటకాలను వింతగా
నిరోధించే మంత్రమే ..
పసుపు కుంకుమల
పరిమళాలు పరివ్యాప్తమై ....
శుచి శుభ్రతలకు పెట్టింది పేరై
పహారా సిపాయే ప్రతి క్షణం రక్షణ
కవచమై ...ఇంటిల్లిపాదికి ఇలవేల్పుగా
ఆరోగ్యాల అనుసంధాయిని...
అచారాలన్నీ సశాస్త్రీయమే ...
అరకొర జ్ఞానాలను ఆర్జించి
తాత తండ్రుల పేర్లు తెలపలేకున్నను
తప్పు పట్టెదము తగుదునమ్మా అంటూ
ఆచారాలను ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment