Saturday, February 10, 2024

పల్లె లోగిళ్ళలో సస్యలక్ష్మి తేది: 11-01-2023 శీర్షిక : సంక్రాంతి

 పల్లె లోగిళ్ళలో సస్యలక్ష్మి 

తేది: 11-01-2023
శీర్షిక : సంక్రాంతి 

దినకరుని గమనంలో దివ్యంగా 
ఆయనం మార్చుకుని అరుదెంచు 
సంక్రమణం మకరరాశిలోన 


సూర్యమానముతో  సుందరమే 
కాలగమనంలో క్రాంతిగా 
మురిపంగా మూడు రోజులు 
ముచ్చటైన పర్వము .... 

భోగ భాగ్యములనిచ్చు భోగి పండగ 
సంపదలనిచ్చు సంక్రాంతిగా 
పశువులను పాటిగా పూజించే కనుమ పండగ 
కాల మహిమలను కనిపెట్టె మానవుడు.... 

ఆవు పేడల కల్లాపి జల్లి
ఆకాశ నక్షత్రాలను అలవోకగ 
అవనిపై దించి అందాలను పేర్చే
అనంత నైపుణ్యాల అతివల నేర్పరి.... 

అల్లంత దూరాన ఆకాశవీధిలో 
అలరించే ఇంద్రధనసులన్నీ 
అవని చేరి ... అతివల చేతులలో 
ఒదిగిపోయి ... ఒయ్యారాలొలుకు 
అందమైన రంగుల హరివిల్లులై  
అలరించు  హంగుల విరిజల్లుగా ...  


మురిసిపోవు పల్లె ఎదలన్నీ 
సిరిమల్లె పరిమళాలతో .... 
ఆధ్యాత్మికతలను స్పర్శిస్తూ 
అనుసంధానించే సంకీర్తనల 
హరిదాసుల పాటలతో .... 
బసవన్నల సయ్యాటలతో ...... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment