అహంకారపు పొర
తేది : 25-01-23
శీర్షిక : సంకరజాతి ....
కవిత సంఖ్య : 209
సంకరజాతి అంకురములా
సభ్యత సంస్కారాల మూట
నెత్తికెత్తుకోకుండా ... మృదుత్వం
తెలియని మొరటుతనం పొదువుకుని ...
ఆత్మీయతలకు ఆమడ దూరంగా
అనురాగాలను అలుముకోకుండా
ఆప్యాయతలంటే చిరాకుపరాకుగా
అహంకారాలను అలంకరించుకుని...
కానీ కష్టమంటే తెలియకుండానే
విల్లులా ఒళ్ళు వంచకుండానే...
కావాల్సినవన్నీ సమకూరిపోయి
కనులముందు కదలాడుతుంటే....
అత్తారింటిలో అల్లుడి మర్యాదలా
అడిగిందల్లా దొరికిపోతూంటే ....
అడగకముందే అమిరిపోతూ
అవసరాలన్నీ తీరిపోతుంటే ....
ఓడెక్కేదాకా ఒడామల్లప్పలైపోయి
ఓడెక్కినాక బోడ మల్లప్పలా తయారై ....
కళ్ళు నెత్తికెక్కి కాననీయని తనంతో
కత్తులు దూస్తుంది అహంకారపు పొర ..
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment