వసంత పంచమి
తేది : 26-01-2023
శీర్షిక : భారతీ దేవి ...
కవిత సంఖ్య : 210
శారదాంబ నమో నమో
మహా మాయి నమో నమో ...
మనమున చిలికిన
భావ తరంగిణులకు ....
భాషనొసిగిన భారతి నీవు
వందనమమ్మా వాగ్దేవి ....!
అక్షరరూపం దాల్చిన నీవు
ప్రగ్యామణిగా విరచితమే ....
బ్రాహ్మణి నీవు చంద్రిక నీవు
కామరూపిణీ...నమో నమో ....!
//శార//
జీవరాశిలో
భావరాశిగ
మానవాళిని మిన్నగ చేసిన
ప్రజ్ఞా దేవివి నీవె కదా
పద్మనిలయా పాహిమాం .. !
ధవళ కాంతుల మణిమయం
ధన్యుల చేయగ బ్రోచితివా ....
ధరణి పైన వెలసితివా
సురవందితనే నమో నమో !
//శార//
మేధస్వినిగా నామమునొంది
సౌదామినిగా మెరిసితివా ...
వీణాపాణి విమలస్వరూపిణి
విదుషీమణి నమో నమో !
నలువరాణికి చెలువముతోడ
భాషాలతల్లికి ప్రణములివే ....
మహిమాన్వితం నీ అవతారం
మహాశ్వేతా...మంజుశ్రీ...నమో నమో !
. //శార//
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment