ఉగాది పచ్చడి
తేదీ -22-03-23
శీర్షిక - షడ్రుచులు
శివోహం అంటూ శిశిరం వెళ్ళిపోతే
వైష్ణవోహం అంటూ వసంతం అడుగిడదా!
మంచు దుప్పట్లను తొలగించుకుని
వన్నె తగ్గిన ప్రకృతి సోయగాలకు
పచ్చ అందాలతో ముద్దాడుతూ…
ఉట్టిపడే జీవకళను పుణికిపుచ్చుకుని
ఉరుకు పరుగున వచ్చే వసంతం…
కొమ్మ రెమ్మలలోన చివుళ్ళువేసి
ఉగాది కోయిలలకు ఊతమిస్తూ
ఉషారు నింపును ప్రతి జీవితాన....
తీపి చేదులను కలుపుకుని
ఉప్పు కారం పులుపు వగరులతో
ఔషధ విలువలతో షడ్రుచుల ఉగాది పచ్చడి
అనుభవాల నీడలలో అనుసరించి సాగేది …
అంగ రంగ వైభవంగా ఆది దేవుడి కళ్యాణం
అపర అయోధ్యయైన భధ్రాద్రి మొదలు
అన్ని ఊళ్లలో ఆచార శుభంబై ఆచరించ
అనుమతప్పుడే కద..... లోక కళ్యాణాలకై …
భూగ్రహపు అక్షము,పరిభ్రమణ కక్ష్య లే
కాల చక్రపు కొలమానం , ఋతువులకు మూలం....
కదులుతున్న కాలాన.. కనువిందు గావించు
ప్రకృతి సోయగాలే నిత్య చైతన్యముతో
పంచుతుంది పండు వెన్నెలలు ప్రతి వారి జీవితాన....
No comments:
Post a Comment