విశ్వమంత విశ్వాసం
తేది : 18-01-2023
శీర్షిక : స్థిత ప్రజ్ఞత
కవిత సంఖ్య: సహస్రాధికం
శీఘ్రగతి ప్రాప్యతలని పొందాలని
అడ్డదారుల్లో చిందులేస్తూ ఆనందాలను
వెదుక్కుంటుంటే తప్పుడు
సంకేతమై తిప్పలు కూడా రావొచ్చు ...
ప్రభవించాలని పరితపిస్తుంటే...
అవరోధాల గోడలు అడ్డుపెట్టి
అడ్డంకులుసృష్టిస్తూ...అణచాలనే
ఆలోచనలకు...స్థితప్రజ్ఞతలతో
స్థిరచిత్తాల సైఅంటూ నిలవడమే ....
ధర్మం నీ దాపున నిలిస్తే ...
ఎన్ని అధర్మాలు ఒక్కటైనా ...
ఆలస్యమౌతుందేమో కానీ
అంధత్వమైతే ఆవరించదు ....
ప్రణాళికల పందిరిలో
ఆశల గమ్యాలన్నీ న్యాయ
కోవిదమైతే ... ఆశయాల గమనాలు
నీతి నియమ సూత్రాలైతే ...
విశ్వమంత విశ్వాసంతో
కృషి పట్టుదలలు పెట్టుబడైతే ....
నీరాజనాలన్నీ నీకే సొంతం ....
సార్వజనీన విజ్ఞానాలను
అందిపుచ్చుకుని ... సామరస్య
వివేకాలను జోడించి ....
అందరు బాగుండాలి ... అందులో
నేనుండాలని కోరుకుంటే ....
విశ్వమంతా నీ వెనుకే .....
నవ్విన నాప చేను పండినట్టు
పూగుచ్ఛం చేతికందించి
పబ్బతి పట్టి నిలిచే విధంగా
అందిపుచ్చుకో అసమాన
విజయాలను అప్రతిహాతంగా ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment