Monday, February 12, 2024

ఊహించని వరం తేది: 15-02-23 శీర్షిక: నా జీవితమే .....

 ఊహించని వరం

తేది: 15-02-23
శీర్షిక: నా జీవితమే ..... 
కవిత సంఖ్య: సహస్రాధికం 

పల్లెలో పరిమళించిన జీవితం 
నిరక్షరాస్యతల నడుమ నిలిచినా .... 
ఒకటొకటిగ  చిక్కులన్నీ ఒద్దికగా 
విడదీసుకుంటూ ....పిల్లలను 
మరో మెట్టెక్కించాలనే తపనలతో 
చదువులవైపు పురికొల్పిన వైనం .... 

ఉద్యమాల గాలి ఊపిరాడనీయక 
పోయినా .... పట్టుదలలే ప్రాణవాయువులుగా  
పెట్టుబడి చేసుకుని... అడుగులో అడుగులు 
వేస్తూ ... తడబడక పట్టుబట్టి సాధించిన 
పట్టభద్రతలు ... 

బతకలేనోళ్లే బడిపంతుళ్ళంటూ ....   
ఉద్యోగాలను ఊదురు పుల్లలాగా 
తీసేస్తున్న రోజుల్లో .... ఊపిరి ఉగ్గపట్టుకుని 
చిన్న మొత్తాలతోనే చింతలను దరి 
చేరనీయక ... ఆత్మస్థైర్యాలను పొదువుకుని 
అడుగులేసి బడుగుతనాలను ఎదిరించి 
నిలిచిన రోజులు ..... 

నవ్విన నాపచేను పండినట్టుగా  .... 
నత్త నడకల జీవితం ... పరుగులు 
పెట్టి ... పిల్లల ఉద్యోగాల పుణ్యమాని 
గగనపు వీధులలో తేలియాడుతూ 
ఖండాంతరాలు కలియ తిరగడం 
ఊహించని వరమే ... మా అమ్మానాన్నల 
కడుపున పుట్టడం ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment