Monday, February 12, 2024

మధురమైన వ్యధ తేది :03-02-23 శీర్షిక : ఖండం దాటిన కన్న పిల్లలు

 మధురమైన వ్యధ

తేది :03-02-23
శీర్షిక : ఖండం దాటిన  కన్న పిల్లలు 
కవిత సంఖ్య : సహస్రాధికం 

గుర్తుకొస్తున్నాయి ఆ మధురక్షణాలు 
మమతల పందిరిలో సేద దీరిన 
మరువ ధవనాల మల్లెగులాబీ వాసనలు 
మరిచిపోలేని భవ బంధాల సుందరం ..... 

మననంతోనే మనసు పరిమళభరితమై 
కనిన క్షణముననే  కనులు వర్షించి 
తనువంతా పులకరింపులమయమై 
హృదయకమలం విప్పార్చుకునేది ..... 

పాలకుల పట్టింపులేనితనమో... 
పగబట్టిన పరిస్థితుల మాయలో ....  
అర్హతలన్నీఅగ్రగామిగా  పొదువుకుని 
అర్ధాకలికి జవాబులు చెప్పలేక .... 

పస్తుంచలేని పొట్టలను చేతపట్టుకుని ... 
ఖండం గాని ఖండాలన్నీ దాటుకుని
అనుక్షణం కన్నవారిని మననం చేసుకుంటూ 
రోజులు వెళ్లదీస్తున్న రోజ్ గార్  ప్రేమికులు .... 

గొప్పలకు గోత్రనామాలుగా నిలిచినా 
ప్రతీక్షణం కన్నవారిని కళ్ళల్లో నిలుపుకుని 
కడుపులు నింపుతున్నాననే తృప్తిని 
బాసటగా చేసుకుని బతుకుతున్న బాటసారిని ....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment