Saturday, February 10, 2024

కవన రవళి నానీలు తేది: 12-01-23

 నానీలు 

తేది: 12-01-23

1. స్వార్థాలను పట్టి
పోగెయ్యాలి
సంక్రాంతి పండగ
భోగి మంటలకు…  

2. అప్పుడప్పుడు పుట్టుక
సాహితీ వనంలో… 
అక్షర సూరీలు
అలిశెట్టి లాగ… 

3. వంటావార్పు
తంటానే లేదు.. 
పట్టుబట్టి 
పిల్లలు తింటే !

4. పదేళ్ళయినా
పంచుతున్న ఫించన్లే… 
కథానాయకులు
నడుస్తున్న కథలో!

5. కూపమందు 
కూర్మంలా కుంచించక...  
విహంగమై వీక్షించు 
విశ్వమెంత విస్తారమో !

నగునూరి రాజన్న

No comments:

Post a Comment