Monday, February 12, 2024

బాలల గేయం తేది: 04-02-2023 శీర్షిక : వినరండోయి

సమూహ సంఖ్య: 41 
అంశం : బాలల గేయం 
తేది: 04-02-2023
శీర్షిక : వినరండోయి
సంఖ్య : సహస్రాధికం 

వినరండోయి వినరండోయి 
బాలల్లారా వినరండోయి 

భావి పౌరులు మీరండి  
భవితను తీర్చి దిద్దుకోండి...  
అమ్మానాన్నలు  ఆదిదైవం 
ఆదరిస్తూనే  జీవించండి .... 

వినయాలను అక్కునచేర్చుకుని 
విధేయతలను పాటించండి... 
విద్యలు నేర్పే గురువులను 
విరివిగా మీరు గౌరవించండి ... 

వినరండోయి వినరండోయి 
బాలల్లారా వినరండోయి... 

పరిశుభ్రతలను పాటించి 
పరిమళాలను వెదజల్లండి ... 
వ్యాయామాలకు పెద్దపీటతో 
ఆరోగ్యాలను కాపాడండి .... 

బడిబాటలలో బాల్యమంతా 
అన్నదమ్ములుగ మెదలండి...  
నీతి నియమం రెండు కళ్లుగా 
ధర్మం న్యాయం ఆచరించండి ... . 

వినరండోయి వినరండోయి 
బాలల్లారా వినరండోయి 

సంస్కృతిని గౌరవిస్తూనే 
సంప్రదాయం  ఆచరించండి ....
పరమత సహనం పాటిస్తూనే  
సర్వులనుఁ ఆదరించండి .... 
  
సమర వీరుల చరితలన్నీ 
సగౌరవంగా  చదవండి ...  
నిత్యం మీరు ప్రేరణ పొందే 
స్వచ్ఛ చరితలు తెలియండి... 

వినరండోయి వినరండోయి 
బాలల్లారా వినరండోయి 

పిట్ట కొంచెం కూత ఘనంలా 
పెద్ద  కలలనే  మీరు కనండి ... 
కార్యదీక్షులై కద లి రండి ...  
కలాములాగ  ఎదగండి ... 

పూరించండి శంఖారావం 
శ్వాసించండి దేశభక్తిని .... 
వినమ్రతలను అభ్యసించి 
విజయాలను  సాధించండి .... 

వినరండోయి వినరండోయి 
బాలల్లారా వినరండోయి 

నగునూరి రాజన్న
కరినగరము 


No comments:

Post a Comment