కవన రవళి
చిత్ర గజల్
తేది : 11-02-2023
6/6/6/6
మనసునిండ నీ రూపం
నింపినాను ప్రియసఖుడా
తనువంతా కనులుచేసి
నిండినాను ప్రియసఖుడా
సుమశరమూ తగలగనే
వలపువాన తడిపినదీ
మనసంతా మురిసినదీ
తలచినాను ప్రియసఖుడా ...
అపురూపపు ఆలోచన
ఆనందం నింపినాది
కలలలోన కవ్వించగ
వేగినాను ప్రియసఖుడా...
మూగబాధ భావనలను
గుండుమల్లె వింటున్నది
తమకంతో వివరించగ
కలచినాను ప్రియసఖుడా ...
నీదానిగ గైకొమ్మని
రాజసమై వలచినాను
గాంభీర్యం పొదువుకుని
వేచినాను ప్రియసఖుడా ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment